AP Farmer Registry Status: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా AP Farmer Registry ను ప్రవేశపెట్టింది. రైతులందరికీ 14 అంకెల ప్రత్యేక ఐడీ నంబర్ ను అందించడంతోపాటు, రైతుల సమాచారాన్ని ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేయడం ద్వారా పథకాల ప్రయోజనాలను నిర్దిష్టంగా అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి స్వంత భూమి కలిగిన ప్రతి రైతు ఈ రిజిస్ట్రీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.
Advertisement
AP Farmer Registry ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలు
ఈ రిజిస్ట్రీ ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా:
- PM-KISAN & అన్నదాత సుఖీభవ పథకాలు ద్వారా ఆర్థిక సహాయం.
- పంట రుణాలు మరియు సబ్సిడీ లోన్స్ పొందే అవకాశం.
- ఎరువులు, విత్తనాల రాయితీలు.
- పంటలకు కనీస మద్దతు ధర మరియు పంట భీమా.
- వివిధ వ్యవసాయ & అనుబంధ రంగాల సేవలు పొందే అవకాశాలు.
AP Farmer Registry కి అప్లై చేసే విధానం
రైతులు ఈ రిజిస్ట్రీకి రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు:
- ఆన్‌లైన్: అధికారిక వెబ్‌సైట్ apfr.agristack.gov.in ద్వారా సులభంగా మొబైల్ నుండే అప్లై చేసుకోవచ్చు.
- ఆఫ్‌లైన్: గ్రామ సచివాలయం లేదా స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయం లో అప్లై చేసుకోవచ్చు.
AP Farmer Registry కి అవసరమైన పత్రాలు
ఈ క్రింది పత్రాలు తప్పనిసరిగా అవసరం:
- ఆధార్ కార్డు (మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి).
- భూమి పాస్ బుక్ (పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్/1-B).
- ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్.
గమనిక: రిజిస్ట్రేషన్ సమయంలో OTP ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరి.
Advertisement