Free Tailoring Machine 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత గారు ప్రకటించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.
Advertisement
ఈ పథకం కింద 1.02 లక్షల మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించనున్నారు. అలాగే, లబ్ధిదారుల కోసం 40 నుండి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ కూడా అందించనున్నారు. శిక్షణ పూర్తయిన తరువాత, మహిళలు తమ స్వంత ఉపాధిని ఏర్పరుచుకునే అవకాశం పొందుతారు. మొదటి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తారు.

ఈ పథకానికి ముఖ్యాంశాలు:
✔ రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు మిషన్లు అందజేయనున్నారు.
✔ బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాల మహిళలు అర్హులు.
✔ శిక్షణ 45 నుండి 90 రోజుల వరకు కొనసాగుతుంది.
✔ ప్రభుత్వం రూ.255 కోట్ల నిధులు కేటాయించింది.
✔ మార్చి 8 నుంచి అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఈ పథకానికి అప్లై చేయడానికి గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చు. అర్హత కలిగిన మహిళలు తమ దగ్గరిలోని సచివాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలి. తాజా అప్డేట్ల కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించండి.
Related Video
Advertisement